
మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ టీజర్ ఈ దసరా పండుగకు విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగ సీజన్‌లో విశ్వంభర విడుదల చేయాలని ముందు అనుకున్నారు.
కానీ రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20కి బదులు జనవరి 10కి వాయిదా పడబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తునందున, దాని కోసం విశ్వంభర సంక్రాంతి పోటీ నుంచి తప్పుకొని మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ‘గేమ్ ఛేంజర్’ వాయిదా పడకుండా డిసెంబర్ 20న వచ్చేస్తే జనవరిలో విశ్వంభర విడుదలకు ఎటువంటి ఆటంకమూ ఉండబోదు.
కనుక విశ్వంభర టీజర్ విడుదలైతే దాంతో ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై పూర్తి స్పష్టతవస్తుంది.
ఇక విశ్వంభర సినిమా ప్రోగ్రెస్ విషయానికి వస్తే, చిరంజీవి రెండు పాటల్ని పూర్తిచేయాల్సి ఉంది. వాటిలో ఒకటి ఐటెమ్ సాంగ్ ఉంది. ఇవి కాక చిరంజీవి చేయాల్సిన కొన్ని సన్నివేశాలు మిగిలి ఉన్నాయి.
కనుక దసరా పండుగ రోజు నుంచి షూటింగ్ మొదలుపెట్టి నవంబర్ నెలాఖరులోగా అన్నీ పూర్తి చేయాలని చిరంజీవి నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.