మొత్తానికి ఐశ్వర్య సాధించింది..!

రీ ఎంట్రీలో ఐశ్వర్య లక్ కలిసి వచ్చినట్టుంది.. హీరోయిన్ గా బాలీవుడ్ ను షేక్ చేసిన ఆమె ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా రెచ్చగొట్టే రొమాన్స్ చేసి వారెవా అనిపించింది. రీసెంట్ గా రణ్ బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మల 'ఏ దిల్ హే ముష్కిల్' సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలక్షన్స్ ను క్రాస్ చేసింది. తన కెరియర్ లో సూపర్ స్టార్స్ తో నటించినా బాలీవుడ్ సినిమాల్లో 100 కోట్ల కలెక్ట్ చేసిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.  

సో ఈ న్యూస్ తో ఐశ్వర్య మరింత జోష్ తో కనబడుతుంది. రణ్ బీర్, అనుష్క శర్మలతో పోటీగా ఈ సినిమాలో నటించిన ఆమె విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అక్టోబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికి 104 కోట్ల పైన కలక్షన్స్ సాధించిందట. ఇక ఈ హిట్ జోరుతోనే ఐశ్వర్య రాయ్ మరిన్ని బాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తుంది.

ఐశ్వర్య రాయ్ ను సౌత్ సినిమాలకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు టాక్. రోబో తర్వాత సౌత్ లో సినిమా చేయని ఐశ్వర్య రాయ్ ను తెలుగు దర్శక నిర్మాతలే ఓ సినిమా కోసం చర్చలు జరుపుతున్నారట. మరి ఐశ్వర్య రెస్పాన్స్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.