గేమ్ ఛేంజర్‌ మళ్ళీ వాయిదా పడిందా?

శంకర్-రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమా ఈ డిసెంబర్‌ 20వ తేదీకి విడుదల కావలసి ఉంది. కానీ అది జనవరి 10వ తేదీకి వాయిదా పడిన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. 

రెండు రోజుల క్రితమే ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ డిసెంబర్‌ 20వ తేదీన గేమ్ ఛేంజర్‌ తప్పకుండా విడుదలవుతుందని చెప్పారు. ఈ నెలాఖరున మూడో పాట, దీపావళికి టీజర్‌ విడుదలవుతాయని చెప్పారు. ఆ తర్వాతే సోషల్ మీడియాలో సినిమా వాయిదా పడిందంటూ ఈ పుకార్లు మొదలవడం విశేషం.   

వాటిపై దర్శక నిర్మాతలు ఇంకా స్పందించలేదు. ఒకవేళ స్పందించకపోతే ఆ పుకార్లు నిజమే అని భావించాల్సి ఉంటుంది.

శంకర్-కమల్ హాసన్‌ కాంబినేషన్‌లో తీసిన భారతీయుడు-2 అంచనాలు అందుకోలేక బోర్లాపడటంతో దర్శకుడు శంకర్ మీద సహజంగానే ఒత్తిడి పెరిగిపోతుంది. కనుక ఎట్టి పరిస్థితులలో గేమ్ ఛేంజర్‌ హిట్ అయ్యేలా అందించాల్సి ఉంటుంది. లేకుంటే వందల కోట్లు ఖర్చు పెట్టించి ఏళ్ళ తరబడి రెండు ఫ్లాప్ సినిమాలు తీసినందుకు శంకర్ పరువుపోతుంది.

అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌ చేస్తున్న తొలి సినిమా ఇది. సుమారు రెండేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా హిట్ అవడం రామ్ చరణ్‌కి చాలా ఆవసరం. తేడా వస్తే అభిమానులు తట్టుకోలేరు.

కనుక ఈ సినిమాకి పనిచేస్తున్న అందరిపై చాలా ఒత్తిడే ఉంటుంది. అది సినిమాలకు మంచి సీజన్‌ కూడా. అందువల్ల గేమ్ ఛేంజర్‌ జనవరికి వాయిదా పడినా ఆశ్చర్యం లేదు.