సింగం-4 లో ఎన్టీఆర్..!

సూర్య నటిస్తున్న సింగం సినిమా థర్డ్ సీక్వల్ వచ్చే నెలలో రిలీజ్ అవబోతుంది. యముడు, సింగం (యముడు-2), ఎస్-3 గా మూడు సీక్వల్స్ లో ఒకే సినిమాలోని క్యారక్టర్స్ కంటిన్యూ చేస్తూ కొత్త కథను నడిపిస్తున్నాడు డైరక్టర్ హరి. అయితే ప్రస్తుతం ఎస్-3 రిలీజ్ అవుతున్న సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ సంచలనాలను సృష్టిస్తుంది. ఇప్పుడు అదే డైరక్టర్ జూనియర్ కు ఓ పవర్ ఫుల్ పోలీస్ కథ వినిపించాడట.  

కథ విన్న తారక్ సూపర్ అనేశాడట. సో తారక్ దర్శకుల లిస్ట్ లో ఇప్పుడు మరో తమిళ దర్శకుడు చేరాడన్నమాట. నిన్న మొన్నటిదాకా వక్కంతం, అనీల్, త్రివిక్రం తో సినిమాలంటూ వచ్చిన వార్తలకి చెక్ పెడుతూ ఈ కొత్త న్యూస్ అందరికి షాక్ ఇస్తుంది. హరి ఎలాగు ఎస్-3 రిలీజ్ తర్వాత ఫ్రీనే సో కుదిరితే ఎన్టీఆర్ చేసే తర్వాత సినిమా హరి దర్శకత్వంలోనే అనే వార్తలు జోరందుకున్నాయి. 

మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అన్నది తెలియదు కాని రీసెంట్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురు రిషెప్షన్ కు వచ్చిన ఎన్.టి.ఆర్ మీసపు కట్టుతో పవర్ ఫుల్ గా కనిపించాడు. సో ఈ లుక్ హరి సినిమా కోసమేనా అని ఆరా తీయడం మొదలు పెట్టారు అందరు. మరి తారక్ హరి కాంబినేషన్ పై వస్తున్న వార్తలన్ని నిజమా కాదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.