ప్రభాస్ స్టార్ అవుతాడంటే నమ్మలేదట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు వైజాగ్ సత్యానంద్. ఎంతోమందిని స్టార్స్ గా తీర్చి దిద్దిన ఆయన ప్రభాస్ విషయంలో ముందు నుండి నమ్మకంగా ఉన్నాడట. ప్రభాస్ తన దగ్గర నటనా శిక్షణ నేర్చుకుంటున్న టైంలోనే అతని టాలెంట్ గుర్తించి ఇతనో పెద్ద స్టార్ అవుతాడని ప్రభాస్ సోదరి, బావలకు చెప్పాడట. అయితే అప్పుడు వారు ఆ విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకున్నారట.

ఇక ప్రస్తుతం మన బాహుబలి అదేనండి ప్రభాస్ రేంజ్ ఏంటో తెలిసిందే. ఆరోజు సత్యానంద్ మాటలు రుజువైందని చెప్పాలి. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ గా మాస్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేశాడు. ఇక తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరని నిర్మొహమాటంగా చెప్పొచ్చు.

సత్యానంద్ దగ్గర ఇప్పుడు స్టార్స్ గా ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి వారు కూడా నటనా శిక్షణ తీసుకున్న వారే. కెరియర్ మొదట్లో ఈయన ఇచ్చిన శిక్షణ ద్వారానే మన స్టార్స్ ఇప్పుడు సూపర్ స్టార్స్ గా నిలబడగలిగారు.