ప్రభాస్‌ డార్లింగ్... ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

కల్కి ఎడి2898 హడావుడితో దాదాపు ఏడాదిపాటు మరో ఆలోచన లేకుండా బాగానే సాగిపోయింది. ఓటీటీలో కూడా కల్కి హడావిడి అయిపోయింది. కనుక అభిమానులు అందరి దృష్టి ‘రాజాసాబ్’ మీదే ఉంది. రాజాసాబ్‌ని మారుతి చాలా కాలం అట్టేబేట్టేసుకున్నాడు కానీ ఇంతవరకు పూర్తి చేయలేదు. కనీసం అప్‌డేట్‌ కూడా ఇవ్వడం లేదని అభిమానులు అసహనం ప్రదర్శిస్తే గ్లింప్స్ ఇచ్చి చల్లబరిచాడు. కానీ అక్టోబర్‌ 23... అంటే ప్రభాస్‌ పుట్టిన రోజు వచ్చేస్తోంది. కనుక రాజాసాబ్ నుంచి గట్టిగా ఏదైనా వాడలాల్సిందే. 

ప్రభాస్‌-హనూ రాఘవపూడి కాంబినేషన్‌లో (ఫౌజీ) ఓ పాన్ ఇండియా మూవీ నుంచి కూడా అక్టోబర్‌ 23న తప్పక అప్‌డేట్‌ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలో ప్రభాస్‌ ఫస్ట్-లుక్, సినిమా టైటిల్‌తో తమకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు. 

ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ కాంబో కల్కి-2 ఓకే అయిపోయింది కనుక దాన్నుంచి కూడా ఓ అప్‌డేట్‌ పడుతుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌ 23న ఈశ్వర్, డార్లింగ్ సినిమాలు రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కనుక ఒకవేళ ఏ సినిమా నుంచి అప్‌డేట్‌ రాకపోతే ప్రభాస్‌ అభిమానులు వాటితో సర్దుకుపోక తప్పదు.