దేవర విజయోత్సవ వేడుక లేనట్లే!

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యిఇప్పటి వరకు  రూ. 396 కోట్లు కలక్షన్స్‌ రాబట్టింది. అవలీలగా మరో రూ.100 కోట్లు రాబడుతుందని అంచనా. భారీ అంచనాల నడుమ విడుదలైన దేవర సినిమా మంచి కలక్షన్స్‌, విజయం సాధించడంతో దేవర విజయోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని జూ.ఎన్టీఆర్‌, దర్శక, నిర్మాతలు భావించారు. 

అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా నవరాత్రుల హడావుడి మొదలవడంతో అనుమతులు లభించలేదని నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించలేదు కనుక కనీసం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని జూ.ఎన్టీఆర్‌ పట్టుబట్టారని కానీ అనుమతి లభించకపోవడం వలన నిర్వహించలేకపోతున్నామని తెలియజేశారు. 

కనుక అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నామని నాగవంశీ ట్వీట్‌ చేశారు. మీ అందరి ప్రేమాభిమానాలతో జూ.ఎన్టీఆర్‌ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాను,” అని ట్వీట్‌ చేశారు.