సందీప్ కిషనా మజాకా... సంక్రాంతికే వస్తున్నాడట!

యువహీరో సందీప్ కిషన్ తాను సినీ పరిశ్రమలో ప్రవేశించి 15 ఏళ్ళయిందని ఇప్పటి వరకు 29 సినిమాలు చేశానని, తన 30వ సినిమాగా మజాకా అనే సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ పెట్టి ప్రకటించాడు. 

పట్టుబట్టలలో కొత్త అల్లుడు కూర్చొని ఉండగా వెనుక పెళ్ళికి సంబందించిన నాదస్వరం ఇత్తడి బిందెలు, అరటిపళ్ళు గెల, కొబ్బరి బోండాలు వగైరాలు చూపారు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో టేప్ రికార్డర్ పట్టుకుని కూర్చోవడం చూస్తే ఇది ఓ పీరియాడికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని అర్ధమవుతోంది.  

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లలో రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రసన్న కుమార్‌ బెజవాడ, సంగీతం: లియాన్ జేమ్స్, కెమెరా: నిజార్ షఫి చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించి ఇతర వివరాలు ఇంకా ప్రకటించవలసి ఉంది.