మా నాన్న సూపర్ హీరో... నాన్నకు ప్రేమతో

తండ్రీ కొడుకుల అనుబంధంపై తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. భావోద్వేగాలను పండించగలిగి, స్క్రీన్ ప్లే సరిగ్గా కుదిరితే అటువంటి సినిమాలు ‘బొమ్మరిల్లు’లా సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి. అటువంటి కధతోనే‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమాతో వస్తున్నారు యువనటుడు సుధీర్ బాబు, సీనియర్ నటులు షాయాజీ షిండే, సాయి చంద్. 

ఈ సినిమాకి ‘లూజర్’ ఫేమ్ దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. ఇటీవల “అనగనగా కధ చెపుతాను... ఆ కధలో మా నాన్నే హీరో...‘ అంటూ సాగే ఓ చక్కటి పాట రిలీజ్ చేశారు. లక్ష్మీ ప్రియ వ్రాసిన ఆ పాటకి జై క్రిష్ స్వరపరచగా నజీరుద్దీన్ మనసులను తాకేలా చక్కగా పాడారు.   

ఈ సినిమాలో ఆర్ణ, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర వెంపటి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: జయ్ క్రిష్, కెమెరా: సమీర్ కళ్యాణి, కొరియోగ్రఫీ: దిల్‌రాజు సుందరం, డైలాగ్స్: భరద్వాజ్, శ్రావణ్, అభిలాష్, ఎడిటింగ్: అనిల్ కుమార్‌ చేస్తున్నారు. వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునిల్ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.