సత్యం సుందరం… ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ 23న

తమిళ నటులు కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో ‘సత్యం సుందరం’ సినిమా ఈ నెల ఈ నెల 28న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళ భాషలలో నిర్మించి ఈ సినిమాని సూర్య, జ్యోతిక దంపతుల సొంత బ్యానర్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించారు.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్లాన్ చేశారు. ఈ నెల 23 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో పార్క్ హయాత్ హోటల్లో నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. దాంతో బాటు కార్తీ, అరవింద్ స్వామిల మరో పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు. 

ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అరవింద స్వామి, కార్తీ బావాబావమరుదులుగా నటిస్తున్నారు. రాజ్‌ కిరణ్, శ్రీ దివ్య తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేశారు. ఇటీవల విడుదలైన టీజర్‌ అందరినీ చాలా ఆకట్టుకుంది. 

ఈ సినిమాకి పాటలు: రాకేందు మౌళి, సంగీతం: గోవింద్ వసంత, కెమెరా: మహేంద్రన్ రాజు, ఎడిటింగ్: గోవింద రాజ్, ఆర్ట్: అయ్యప్పన్ చేశారు.  

జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన దేవర సినిమా భారీ అంచనాలతో ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఆ మర్నాడే ‘సత్యం సుందరం’ విడుదల చేస్తుండటం గమనిస్తే, దేవరతో పోటీని తట్టుకొని నిలబడగలదని దర్శక నిర్మాతలు తమ సినిమాపై గట్టి నమ్మకమే పెట్టుకున్నట్లు భావించవచ్చు.