
జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా ప్రీ-రిలీజ్ ట్రైలర్ ఈరోజు ఉదయం 11.07 గంటలకు విడుదల కావలసి ఉండగా సుమారు రెండు గంటలు ఆలస్యంగా విడుదలయ్యింది. దీంతో అభిమానులు శాంతించారు. అది చూసి బహుశః చాలా సంతోషించే ఉంటారు.
మరి కొద్ది సేపటిలో హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్లో దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి దర్శకులు రాజమౌళి, త్రివిక్రం శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ అతిధులుగా రాబోతున్నారు. మహేష్ బాబు ముఖ్య అతిధిగా వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా వస్తున్న దేవర మొదటి భాగం ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఈరోజు సాయంత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ పూర్తవగానే దేవర సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా నేడు ప్రారంభం కాకపోతే రేపు ఉదయం నుంచి ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది.