జానీ మాస్టర్‌ వెనుక కుట్ర జరిగింది: నిర్మాత

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ వ్యవహారంలో పైకి కనబడుతున్నది ఒకటైతే తెర వెనుక మరేదో జరిగిందనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఇప్పటికే నాగబాబు, మంచు మనోజ్ ఆయనకు మద్దతుగా ట్వీట్స్ చేయగా, ఇప్పుడు నిర్మాత సి.కళ్యాణ్ కూడా జానీ మాస్టర్‌కి మద్దతుగా మాట్లాడారు. 

“జానీ మాస్టర్‌ విషయంలో వెనుక ఏదో పెద్ద కుట్ర జరిగిందని నేను నమ్ముతున్నాను. దాని గురించి నేను నా స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాను. పూర్తి ఆధారాలు లభించగానే మీడియా ముందుకు వచ్చి వాటిని బయటపెడతాను. బాడితురాలికి 16 సం.ల వయసున్నప్పుడు జానీ మాస్టర్‌ అత్యాచారం చేస్తే మరి 5 ఏళ్ళపాటు మౌనంగా ఎందుకు ఉంది? ఇప్పుడే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది?

ఎవరికైనా చెపితే జానీ మాస్టర్‌ తన కెరీర్‌ దెబ్బ తీస్తాడని భయపడి ఇంతకాలం బయట పెట్టలేదని ఆ అమ్మాయి చెపుతోంది. అయితే ఇప్పుడు బయట పెడితే కెరీర్‌ దెబ్బ తినదా? ఆమె ఆరోపణలు నిజమే అని ధృవీకరించే బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు చూపిస్తే జానీ మాస్టర్‌ని నేనే కాదు ఎవరూ వెనకేసుకురారు. కానీ కేవలం ఆమె ఆరోపణల ఆధారంగా కేసులు నమోదు చేస్తే రేపు ఇండస్ట్రీలో ఎవరు ఎవరినైనా కేసులలో ఇరికించవచ్చు కదా?

సినీ పరిశ్రమలో దాసరి నారాయణ రావు లేని లోటు ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతోంది. ఆయనే ఉండి ఉంటే అసలు ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చేడే కాదు. ఏది ఏమైనప్పటికీ నేను తెలుసుకున్న వివరాలతో త్వరలోనే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వివరిస్తాను,” అని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు. 

ఆయన ఏమన్నారో ఆయన మాటలలోనే...

(Video Courtecy: TV9 Telugu)