చంచల్‌గూడా జైలుకి జానీ మాస్టర్‌!

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ని తెలంగాణ పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పరపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌ విదించడంతో పోలీసులు ఆయనని చంచల్‌గూడా జైలుకి తరలించారు. 

పోలీసులు కోర్టుకి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో బాధితురాలి ఆరోపణలు నిజమే అని ధృవీకరించారు. జానీ మాస్టర్‌ని ప్రాధమిక విచారణ చేయగా అతను బాధితురాలిపై మోజుతోనే తన బృందంలో చేర్చుకుని, ఆమె లొంగకపోవడంతో లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 

బాధితురాలికి 16 ఏళ్ళు వయసు ఉన్నప్పుడే అంటే 2020లో ముంబైలో ఓ హోటల్లో జానీ మాస్టర్‌ ఆమెపై లైంగిక దాడి చేసిన్నట్లు ఒప్పుకున్నారని జ్యూడిషియల్ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. గత నాలుగేళ్ళుగా ఆమెను బెదిరిస్తూ అత్యాచారం చేస్తూనే ఉన్నాడని రిపోర్టులో పేర్కొన్నారు. 

ఈ విషయం బయటకు చెపితే సినీ పరిశ్రమ నుంచి బయటకు పోవలసి వస్తుందని బెదిరిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడేవారని రిపోర్టులో పేర్కొన్నారు. కానీ గత కొంతకాలంగా ఆమె సహకరించకపోవడంతో సినీ పరిశ్రమలో ఆమెకు అవకాశాలు రాకుండా జానీ మాస్టర్‌ అడ్డుకున్నారని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. బాధితురాలిని జానీ మాస్టర్‌ భార్య కూడా బెదిరించారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.