హైడ్ న్‌ సీక్ బిస్కెట్ కాదు..ఆట కాదు... క్రైమ్ ధ్రిల్లర్!

ఇప్పుడు అనేకమంది కొత్త రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు విభిన్నమైన కధాంశాలతో సినిమాలు తీస్తున్నారు. వారిలో కొందరు మొదటి ప్రయత్నంలోనే మెప్పిస్తుండగా మరికొందరు పర్వాలేదనిపించుకొని మరో సినిమాకి సిద్దం అవుతున్నారు. వారి సినిమా కధలే కాదు సినిమా పేర్లు కూడా చాలా విలక్షణంగా ఆకట్టుకునేలా ఉంటున్నాయి. 

తాజాగా బసిరెడ్డి రాణా దర్శకత్వంలో విశ్వంత్, శిల్పా మంజునాధ్ తదితరులు నటించిన ‘హైడ్ న్‌ సీక్’ అనే సినిమా  నేడు (సెప్టెంబర్‌ 20) విడుదలయ్యింది. 

‘హైడ్ న్‌ సీక్’ అనగానే ఆ పేరుతో ఉన్న బిస్కట్ ప్యాకెట్ లేదా చిన్న పిల్లలు ఆడుకునే ఆట గుర్తొస్తాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని స్పష్టం అవుతుంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది మరి సినిమా ఎలా ఉందో?

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: బసిరెడ్డి రాణా, సంగీతం: లిజో కె జోస్, లిరిక్స్: సుద్ధాల అశోక్ తేజ, కెమెరా: చిన్న రామ్, ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల, ఆర్ట్: నిఖిల్ హస్సార్ చేశారు.