
రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యే రెండేళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో మొదలుపెట్టిన గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ నేటికీ పూర్తికాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సంగీత దర్శకుడు చూచాయగా చెప్పేశారు.
“వచ్చే వారం నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి డిసెంబర్ 20వరకు కంటిన్యూ చేస్తామని, అందరూ సిద్దంగా ఉండండి” అంటూ ట్వీట్ చేసి సినిమా రిలీజ్ డేట్ చెప్పేశారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ కూడా దానిని మళ్ళీ పోస్ట్ చేయడంతో సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసిన్నట్లయింది. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోందని తెలిసి రామ్ చరణ్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్‌కి కియరా అద్వానీ హీరోయిన్గా నటించగా, మరో పాత్రకి అంజలి జోడీగా నటించింది. శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.