
కొరటాల-జూ.ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ నెల 27న విడుదల కాబోతున్న ‘దేవర’ అప్పుడే రికార్డులు బద్దలు కొడుతోంది. ట్రైలర్ విడుదలకు ముందే నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్స్ ప్రీసేల్ ద్వారా ఒక మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. లాస్ ఏంజల్స్‌లో ప్రతిష్టాత్మకమైన ‘బియాండ్ ఫెస్ట్’ సినీ వేడుకలలో ప్రదర్శితం కాబోతున్న తొలి భారతీయ సినిమా కూడా ఇదే.
అదేవిదంగా బ్రిటన్‌లోని ప్రఖ్యాత డల్బీ అట్మాస్ థియేటర్లో ప్రదర్శితం కాబోతున్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే. ఈ నెల 26వ తేదీన ఈ థియేటర్లో ప్రీమియర్స్ వేయనున్నారు.
అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దక్షిణాదిలో చేస్తున్న తొలి సినిమా, తొలి తెలుగు సినిమా ఇదే. జనతా గ్యారేజ్ తర్వాత కొరాటాల శివ జూ.ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా కనుక దేవరపై చాలా భారీ అంచనాలున్నాయి.
దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేశారు.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికేట్ లభించింది.