మెకానిక్ రాఖీ నుంచి ఓ పిల్లో... రెండో లిరికల్

గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి రెండు విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్‌, తర్వాత ‘మెకానిక్ రాఖీ’గా రాబోతున్నాడు. విశ్వక్ సేన్‌ 10వ సినిమాగా వస్తున్న మెకానిక్ రాఖీకి నూతన దర్శకుడు ముళ్ళపూడి రవితేజ దర్శకత్వం చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా నుంచి ‘ఓ పిల్లో...’ అంటూ సాగే రెండో లిరికల్ సాంగ్‌ విడుదలైంది. 

కృష్ణ చైతన్య వ్రాసిన ఈ పాటని జేక్స్ బిజోయ్ స్వరపరచగా నకాష్ అజీజ్ మధురంగా పాడారు. 

మెకానిక్ రాఖీ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాధ్, సునీల్, నరేశ్ వికె, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వివ హర్ష, రఘురాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

మెకానిక్ రాఖీకి కధ, దర్శకత్వం రవితేజ ముళ్ళపూడి, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, కృష్ణ చైతన్య, సనరే, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని, కొరియోగ్రఫీ: భాను, యష్, యాక్షన్: సుప్రీం సుందర్, ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు. . 

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న మెకానిక్ రాఖీ అక్టోబర్‌ 31న విడుదల కాబోతోంది. 

ఈ సినిమా తర్వాత ‘లైలా’ అనే మరో సినిమాకి విశ్వక్ సేన్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశాడు. రామ్ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్‌ తొలిసారిగా అమ్మాయి వేషంలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది 2025, ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున విడుదల చేయబోతున్నట్లు ముందే ప్రకటించారు. 

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ ప్రసాద్ చేస్తున్నారు.