
నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇక తన తర్వాత సినిమా రైతు కథను తెరకెక్కించే నేపథ్యంతో కృష్ణంవంశీతో ఇన్నాళ్లు చర్చలు జరిపిన బాలయ్య ఎందుకో ఆ సినిమా నుండి వెనక్కి తగ్గాడని ఫిల్మ్ నగర్ టాక్. సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం అమితాబ్ ను కూడా ఒప్పించి మళ్లీ ఎందుకు ఈ సినిమాను అటకెక్కించారో తెలియలేదు. అయితే తెలుస్తున్నంత వరకు బాలయ్య, కృష్ణవంశీ మధ్య చిన్న డిస్టబెన్స్ వచ్చిందని అందుకే ఈ సినిమా నుండి బాలయ్య తప్పుకున్నాడని అంటున్నారు.
ఆకుల శివ రాసిన ఈ కథ తనకు బాగా నచ్చితే దర్శకుడిని మార్చితే సరిపోతుంది అలాంటిది బాలయ్యే సినిమా నుండి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అన్న విషయం మీద ఆరా తీయడం మొదలు పెట్టారు.. ఈ క్రమంలో బాలయ్య 101వ సినిమా కృష్ణవంశీతో ఉండే అవకాశాలు లేవని క్లియర్ కట్ గా తెలుస్తుంది. అర్ధాంతరంగా రైతు కథ కంచికి చేరడానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్లో పడ్డారు.
తమ కష్టాలు తమ అభిమాన నటుడి రూపంలో చూసేద్దాం అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలేలా ఉంది. ప్రస్తుతం నక్షత్రం బిజీలో కృష్ణంవంశీ, శాతకర్ణి షెడ్యూల్ లో బాలయ్య బిజీగా ఉన్నారు. సో అవి పూర్తయితే కాని సినిమా మీద ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు.