జబర్దస్త్ కు పోటీగా..!

బుల్లితెర మీద జబర్దస్త్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు కాస్త డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైనప్పటికి గురు, శుక్రవారాలొచ్చాయంటే చాలు టివిలకు అతుక్కుపోతారు ఆడియెన్స్.. అయితే ఆ షో ద్వారా కంటెస్టంట్స్ అందరికి మంచి అవకాశాలొచ్చాయి. ఇప్పటికి హయ్యెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ తో అదరగొడుతున్న జబర్దస్త్ కు పోటీగా ఓ లీడింగ్ ఛానెల్ మరో కొత్త ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నారట.   

నాగబాబు. రోజా మాదిరి అదే రేంజ్ సెలబ్రిటీస్ అయిన పోసాని కృష్ణ మురళి, రమ్యకృష్ణలను జడ్జులుగా పెట్టబోతున్నారట. అయితే ఇప్పటికే జీ తెలుగులో జబర్దస్త్ లాంటి కామెడీ క్లబ్ ఒకటి పెట్టారు కాని అది ఎందుకో అంతలా క్లిక్ అవ్వలేదు. ఈ క్రమంలో మరో ఛానెల్ ఇలాంటి ప్రయత్నమే చేస్తుంది. ప్రస్తుతం టాప్ రేటింగ్ ఉన్న స్మాల్ స్క్రీన్ ప్రోగ్రామ్స్ లో జబర్దస్త్ ఒకటి. మరి దాన్ని ఢీ కొట్టేలా ఈ కొత్త ప్రోగ్రాం ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. 

ఈ ప్రోగ్రాంకు సంబందించిన షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందట కూడా.. జబర్దస్త్ మించే ఓవర్డోస్ కామెడీతో కడుపుబ్బా నవ్వించడం ఖాయం అంటున్నారు నిర్వాహకులు. మరి జబర్దస్త్ లోనే అడల్ట్ డోస్ ఎక్కువైందని అప్పుడప్పుడు అనుకుంటాం మరి అంతకుమించి అంటే కాస్త ఆలోచించాల్సిందే. కొత్త ప్రోగ్రాం ఎలా ఉంటుందో చూడాలి మరి.