
జనతా గ్యారేజ్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న జూనియర్ తన తర్వాత సినిమాల విషయంలో ఫుల్ బిజీగా దర్శకులతో డిస్కషన్ లో ఉన్నాడు. అయితే ఈ క్రమంలో తారక్ పై తాజా రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎన్.టి.ఆర్ తర్వాత సినిమా లుక్ ఇదేనంటూ ఓ పిక్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్ ఈ పిక్ తో జూనియర్ లుక్ చూసి షాక్ అవుతున్నారు. మాసిన గడ్డంతో డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్న తారక్ చూసి ఫ్యాన్స్ ఒకింత కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.
అయితే కథ ఫైనల్ కాకుండా తారక్ ఎలా గడ్డం పెంచుతాడు అన్నది ఫ్యాన్స్ ప్రశ్న. ఇక రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నంలో తారక్ పి.ఆర్ టీం అది నాన్నకు ప్రేమతో కన్నా ముందు తారక్ లుక్ అంతేకాని తర్వాత సినిమాకు సంబందించింది కాదని చెప్పేశారు. నాన్నకు ప్రేమతోలో డిఫరెంట్ స్టైల్ కోసం ట్రై చేసిన జూనియర్ ముందు ఇలా గడ్డం భారీగా పెంచి దాన్ని స్టైలిష్ గా డిజైన్ చేయించాడట.
సో ఇదంతా సుక్కు సినిమా కోసం పెంచిన గడ్డం అన్నమాట. సో పి.ఆర్ టీం క్లారిటీ ఇచ్చాక కాని ఈ రూమర్స్ ఆగిపోలేదు. ప్రస్తుతం అనీల్ రావిపూడితో కథ ఒకే చేసినా అతని దర్శకత్వంలో సినిమా అంటే వెనుకడుగు వేస్తున్నాడట తారక్. మరి ఫైనల్ గా ఏ డైరక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.