
గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మణి పెళ్లి అంగరంగ వైభవంగా జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్లి వేడుకకు సిని కలర్ అద్దే ఏర్పాట్లు చేస్తున్నాడు గాలి జనార్ధన్ రెడ్డి. ఇప్పటికే సిని పరిశ్రమకు చెందిన పెద్ద వారందరిని ఫోన్ లో ఇన్వైట్ చేసిన గాలి స్పెషల్ గా సినిమా హీరోయిన్స్ ను సంగీత్ లో డ్యాన్స్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ గాలి ఇంట్లో చిందులు వేసేందుకు సై అన్నదని టాక్. ఇందుకు గాను అమ్మడికి ఓ రెండు మూడు సినిమాల రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారని టాక్ వస్తుంది.
ఇక రకుల్ తో పాటుగా ప్రియమణి కూడా ఈ ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తుందట. ఇక వీరే కాదు బ్రహ్మానందంతో స్పెషల్ కామెడీ షో ఏర్పాటు చేస్తున్నారట అందుకుగాను బ్రహ్మికి పెద్ద మొత్తాన్నే ముట్టచెబుతున్నారట. పెళ్లి కార్డ్ ఒకటే ఆరు వేల రూపాయలు పెట్టి డిజైన్ చేయించిన గాలి మిగతా ఏర్పాట్లు ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప గాలికి సన్నిహితుడే కాబట్టి సినిమా వాళ్లకు సంబంధించిన విషయాలన్ని తానే చూసుకుంటాడని తెలుస్తుంది. సో మొత్తానికి గాలి ఇంట సిని కలరింగ్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట.