విజయ్‌ వర్మతో తమన్నా రిలేషన్‌షిప్ బాగానే ఉందా?

శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో టాలీవుడ్‌లో నంబర్ 1 హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత జీవితం గురించి అడిగిన ఓ ప్రశ్నకు చాలా కాలంగా మనసులో దాచుకున్న విషయాలు బయటకు చెప్పారు. 

“నా జీవితంలో రెండు సార్లు బ్రేకప్ అయ్యాను. మొదటిసారి టీనేజ్‌లో ఉన్నప్పుడు. రెండోసారి సినీ పరిశ్రమలో ప్రవేశించిన తర్వాత. టీనేజ్‌లో ప్రేమ చాలా అద్భుతంగా అనిపించేది. నా జీవితంలో నేను సాధించాల్సింది చాలా ఉందని గట్టిగా నమ్ముతున్నప్పుడు, అవతలి వ్యక్తి కోసం నా జీవితాన్ని మార్చుకోవలసి వస్తుందని గ్రహించినప్పుడు  బ్రేకప్ చెప్పాను. ఆ బాధ భరించడం చాలా కష్టమనిపించింది. 

ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడ్డాను కానీ అవతలి వ్యక్తి వ్యక్తిత్వం నన్ను పదేపదే ఆలోచనలో పడేసేది. అతను నాకు సరిపోడని గ్రహించి బ్రేకప్ చెప్పాను. కానీ బ్రేకప్ తర్వాత బాధ భరించడం చాలా కష్టంగా ఉండేది,” అని తమన్నా చెప్పారు. 

ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మతో తమన్నా మూడోసారి ప్రేమలో పడి రిలేషన్‌లో ఉన్నారు. వారి రిలేషన్‌షిప్ పెళ్ళి పీటల వరకు వెళుతుందా లేదా? అనేది బహుశః ఒకటి రెండేళ్ళలో తెలియవచ్చు. 

సాధారణంగా సినిమా హీరోయిన్లు సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తమన్నాకి హీరోయిన్‌గా అవకాశాలు తగ్గినా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె స్త్రీ-2, ఓదెల-2 సినిమాలలో నటిస్తున్నారు.