త్వరలో గేమ్ చేంజర్‌ నుంచి రెండో పాట

శనివారం వినాయక చవితి సందర్భంగా నిర్మాణంలో ఉన్న పలు సినిమాలకు సంబందించి అప్‌డేట్స్ ప్రకటించాయి ఆయా నిర్మాణ సంస్థలు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్‌ సినిమా నుంచి కూడా ఓ అప్‌డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి రెండో పాట ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్లు శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్  సోషల్ మీడియాలో ప్రకటించింది. దాంతోబాటు రామ్ చరణ్‌ పోస్టర్‌ విడుదల చేసింది. తలకు ఎర్ర తువ్వాలు కట్టుకొని డ్యాన్స్ చేస్తున్న రామ్ చరణ్‌ పోస్టర్‌ అభిమానులకు చాలా సంతోషం కలిగించే ఉంటుంది. 

గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు హీరోయిన్‌గా కియరా అద్వానీ నటిస్తున్నారు. కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 20వ తేదీన విడుదల కాబోతోంది.