మత్తు వదలరా-2 టీజర్‌ రిలీజ్

శ్రీ సింహా, సత్య, వెన్నెల కిషోర్, ఫారియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో రితేష్ రాణా దర్శకత్వంలో మత్తు వదలరా-2 సెప్టెంబర్‌ 13వ తేదీన విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం టీజర్‌ విడుదల చేశారు. 

కామెడియన్లు అందరూ కలిసి యాక్షన్ సినిమాలో నటిస్తే వారు ఎంత హాస్యం పండించగలరో టీజర్‌ చూస్తే అర్దమవుతుంది. 2019లో వచ్చిన ‘మత్తు వదలరా’ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా ఈ సినిమా తీసి విడుదల చేస్తున్నారు.  

మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బనార్లపై కలిసి నిర్మించిన ఈ సినిమాకి చిరంజీవి (చెర్రీ), హేమలత పెడమళ్ళు నిర్మాతలు. 

ఈ సినిమాకి సంగీతం: కాల భైరవ, కెమెరా: సురేష్ సారంగం, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు.