త్వరలో ఉస్తాద్ వస్తాడట

పవన్‌ కళ్యాణ్‌ ఏపీ రాజకీయాలలో చాలా బిజీ అయిపోవడంతో ఇదివరకు మొదలు పెట్టిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు పూర్తిచేస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వీటిపై మైత్రీ మూవీ మేకర్స్‌ స్పందిస్తూ, “ఉస్తాద్ భగత్ సింగ్ చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ డేట్స్ ఇచ్చారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభిస్తాము. సెప్టెంబర్‌ 2వ తేదీన పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ అప్‌డేట్‌ కూడా ఇస్తామని తెలియజేసింది. 

ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా షూటింగ్‌కి హాజరవగలిగితే, ముందుగా ఆయన పాత్రకి సంబందించిన సన్నివేశాలని పూర్తిచేసుకునేందుకు వీలుగా దర్శకుడు హరీష్ శంకర్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అవడంతో తీవ్ర నిరాశ చేసిన హరీష్ శంకర్‌ ఈ సినిమాతో హిట్ కొట్టగలిగితే మళ్ళీ ఫామ్‌లోకి వచ్చి నిలబడగలరు లేకుంటే మళ్ళీ ఇటువంటి అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది. 

పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలకు కూడా డేట్స్ కేటాయించి షూటింగ్‌ పూర్తిచేయగలిగితే మంచిదే. లేకుంటే ఆ సినిమాల నిర్మాతలు ఎలాగూ నష్టపోతారు. ఈలోగా పవన్‌ కళ్యాణ్‌‌ రూపురేఖలు మారిపోతే ఆ సినిమాలు పూర్తిచేయడం ఇంకా కష్టమవుతుంది.