పుష్ప-2 తగ్గేదేలే... డిసెంబర్‌ 6నే రిలీజ్!

సుకుమార్-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సిద్దం అవుతున్న పుష్ప-2 సినిమా విడుదలయ్యే సమయానికి అల్లు అర్జున్‌ వివాదాలలో చిక్కుకోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తూనే ఉంది. అయితే షూటింగ్‌ పూర్తికాకపోవడం వలననే ఆగస్ట్ 15కి విడుదల చేద్దామనుకున్న సినిమాని డిసెంబర్‌ 6కి వాయిదా వేశామని నిర్మాత రవిశంకర్ చెప్పారు. 

ఇప్పుడు అల్లు అర్జున్‌ తాజా వ్యాఖ్యలతో మరోసారి వివాదం రాజుకోవడంతో పుష్ప-2 మళ్ళీ వాయిదా పడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వాటిపై నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ స్పందిస్తూ, అవన్నీ ఊహాగానాలే. సెప్టెంబర్‌ 2న ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇచ్చేస్తాము. అవి పూర్తయ్యేలోగా అక్టోబర్‌ 6వ తేదీకి సెకండ్ హాఫ్ కూడా ఇచ్చేస్తాము. కనుక నవంబర్‌ 28లోగా చేతికి ఫస్ట్ ప్రింట్ కూడా చేతికి వచ్చేస్తుంది.

నవంబర్‌ 25న సెన్సార్ బోర్డుకి పంపిస్తే నాలుగైదు రోజులలో సెన్సార్ సర్టిఫికేట్, క్లియరెన్స్ వచ్చేస్తాయి. కనుక డిసెంబర్‌ 6వ తేదీన పుష్ప-2 విడుదల ఖాయం,” అంటూ పుష్ప-2 పూర్తి షెడ్యూల్ ఇచ్చేశారు. కనుక బన్నీ అభిమానులు ఇక హ్యాపీగా ఉండొచ్చు.