కల్కి-2 షూటింగ్‌ ఎప్పటి నుంచంటే...

నాగ్ అశ్విన్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి ఎడి2898 సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.1200 కోట్లు కలక్షన్స్‌ రాబట్టింది. భారతీయ సినీ పరిశ్రమలో రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా అచ్చమైన భారతీయ మూలాలు, కధాంశంతో హాలీవుడ్ స్థాయిలో కల్కి ఎడి2898 ఉండటంతో యావత్ దేశ ప్రజలు చూసి ఆనందించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారు కూడా ఇప్పుడు ఓటీటీలో చూసి ఆనందిస్తున్నారు. 

కల్కి ఎడి2898 మొదలుపెడుతున్నప్పుడే దీనికి సీక్వెల్‌ కధని నాగ్ అశ్విన్‌ సిద్దం చేసుకున్నారు. అదేవిషయం నాక్కూడా చెప్పారని కమల్ హాసన్‌ చెప్పారు. కల్కి ఎడి2898 విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత నాగ్ అశ్విన్‌, నిర్మాత అశ్వినీ దత్ కూడా సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించేశారు. 

ఈ సినిమాని రష్యన్ భాషలో డబ్ చేసి విడుదల చేస్తున్న సందర్భంగా వారిరువురూ ఇటీవల మాస్కో వెళ్లారు. అక్కడ ‘ఫిలిమ్ ఫెస్టివల్ వీక్’లో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “2025 జనవరి-ఫిబ్రవరి మద్య కల్కి ఎడి2898 సీక్వెల్‌ రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెడతామని చెప్పారు. ఈసారి కధతో సహా అన్ని ముందే సిద్దంగా ఉన్నందున ఏడాదిలోగానే సీక్వెల్‌ పూర్తిచేసి 2026 జనవరి-ఫిబ్రవరి మద్య విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.