
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి ఎడి2898లో సుప్రీం యాస్కిన్ కింద పనిచేసే కమాండర్ మానస్‌గా స్వస్థ చటర్జీ నటించారు. ఆ సినిమాలో అశ్వధామగా నటించిన అమితాబ్ బచ్చన్‌తో ఓ యుద్ధం సీన్లో కూడా స్వస్థ చటర్జీ నటించారు.
అయితే ఆయన పక్కన నటించాలనే తన కోరిక తీరనే లేదన్నారు. ఆ సినిమాలో అశ్వధామ పాత్రని ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఆయన 8 అడుగులు ఉన్నట్లు చూపారు. కనుక ఆయన పక్కన నటించే అవకాశం లభించలేదన్నారు. క్లైమాక్స్ యుద్ధ సన్నివేశంలో మా ఇద్దరి మద్య జరిగే యుద్దాన్ని విడివిడిగానే చిత్రీకరించి తర్వాత ఎడిటింగ్‌లో కలిపారని చెప్పారు స్వాస్థ చటర్జీ.
అయితే అమితాబ్ బచ్చన్ నటనని ఇంత దగ్గరగా చూసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత వయసులో కూడా అమితాబ్ బచ్చన్ అంత చురుకుగా, ఉత్సాహంగా నటించడం చాలా గొప్ప విషయమని, ఆయన నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని స్వాస్థ చటర్జీ అన్నారు.
కల్కి ఎడి2898 సీక్వెల్‌కి ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని, ముందు అనుకున్న సమయం ప్రకారమే షూటింగ్ మొదలవుతుందని స్వాస్థ చటర్జీ చెప్పారు.