జూ.ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న దేవర సినిమా నుంచి మూడో లిరికల్ సాంగ్ సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
మొదటి రెండు పాటలు అభిమానులకు తెగ నచ్చేశాయి. మూడో పాట, దానిలో జూ.ఎన్టీఆర్ డ్యాన్స్ అంతకి మించి ఉంటుందని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి చేస్తున్న ట్వీట్స్ అభిమానులకు చాలా ఉత్సాహం కలిగిస్తున్నాయి. వారిని ఆతృతగా ఎదురు చూసేలా చేస్తున్నాయి.
ఇటీవల ఆయుధ పూజకు సంబందించి ఓ పాటని చిత్రీకరించామని చెప్పారు. కనుక దానినే విడుదల చేస్తారా లేక మరో పాటని విడుదల చేస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
దేవరలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.