చిరు సెట్లో కన్నీళ్లు పెట్టాడా..!

మెగాస్టార్ చిరంజీవి సెట్స్ లో ఓ డ్యాన్స్ మాస్టర్ తన ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేశాడట. ఇంతకీ ఏం జరిగిందని డ్యాన్స్ మాస్టర్ కన్నీళ్లు పెట్టాడని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మెగా హీరోలకు డ్యాన్స్ కంపోజ్ చేయడంలో ఈమధ్య బాగా పాపులర్ అయ్యాడు జాని మాస్టర్. తన అభిమాన హీరో డ్యాన్సింగ్ స్టార్ మెగాస్టార్.. చిరంజీవి డ్యాన్సులు చూస్తూ పెరిగి డ్యాన్స్ మాస్టర్ గా మారిన జాని మాస్టర్ ఇప్పుడు ఖైది సినిమాకు చిరుకి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు.   

చిరంజీవి తన స్టెప్స్ వేయడం పట్ల తన ఆనందాన్ని కన్నీళ్లతో తెలియ చేశాడు జాని. మెగాస్టార్ డ్యాన్సులు చూస్తూ పెరిగిన తాను డ్యాన్స్ మాస్టర్ గా ఆ మెగాస్టార్ కే డ్యాన్స్ కంపోజ్ చేయడంతో ఇదో అద్భుతమైన ఫీలింగ్ అని అంటున్నాడు. అభిమాన నటుడితో ఫోటో దిగితేనే సంతోష పడతాం అలాంటిది మెగాస్టార్ అభిమాని అయ్యుండి ఆయనకే డ్యాన్స్ కంపోజ్ చేసే అవకాశం కొట్టేశాడంటే ఇక జాని ఆ క్షణం పొందిన అనుభూతి ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. మెగాస్టార్ తో జాని మాస్టర్ చూపించిన ప్రతిభ ఏంటో సినిమా రిలీజ్ అయ్యాక కాని తెలుస్తుంది.