నా అవసరం లేదట... ఈగ ఉంటే చాలాట!

రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలలో 2012లో వచ్చిన ‘ఈగ’ సినిమా ఎవరూ ఊహించని విదంగా పెద్ద హిట్ అయ్యింది. దేశంలోనే కాక విదేశీ ప్రేక్షకులు, విమర్శకులను సైతం మెప్పించి పలు అవార్డులో అందుకుంది.

\కనుక ఈగకి సీక్వెల్‌ ఉంటుందనే అందరూ అనుకున్నారు. వారిలో హీరో నాని కూడా ఒకరు. ఇటీవల సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు ఈగ ప్రస్తావన కూడా వచ్చింది.

దాని గురించి నాని మాట్లాడుతూ, ఓసారి దర్శకుడు రాజమౌళిని కలిసినప్పుడు సరదాగా ఈగ సీక్వెల్‌ ఎప్పుడు మొదలుపెడదాము సార్? అని అడిగాను. దానికి ఆయన నవ్వుతూ ఈగ సీక్వెల్‌ తీస్తే ఈసారి నువ్వు అవసరం లేదు... ఈగ ఉంటే చాలు. దాంతోనే కానిచ్చేస్తానని అన్నారని నాని నవ్వుతూ చెప్పారు. 

ఓ ఈగతో సినిమా తీయాలనుకోవడమే చాలా ధైర్యం ఉండాలి. పైగా ఆ ఈగ ప్రతీకారం తీర్చుకోవడం ఎవరూ ఊహించలేనిది. కానీ రాజమౌళి సార్ అలాంటి అసాధ్యాన్ని సుపార్ హిట్ చేసి చూపారు. కనుక నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా ఈగ సీక్వెల్‌ తప్పకుండా తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని నాని అన్నారు. నిజమే కదా?