ఆహాలో పురుషోత్తముడు, నెట్‌ఫ్లిక్స్‌లో బడ్డీ!

ఈవారం రెండు కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అవి రాజ్‌తరుణ్‌ నటించిన ‘పురుషోత్తముడు’, అల్లు శిరీశ్ నటించిన ‘బడ్డీ’. వీటిలో పురుషోత్తముడు ఈ నెల 29 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతుంటే మర్నాడు అంటే ఆగస్ట్ 30 నుంచి ‘బడ్డీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. 

ఓ ఆగర్భశ్రీమంతుడి కొడుకు సామాన్యుడిలా ఓ పల్లెటూరిలో 100 రోజులు జీవితం గడుపుతూ ఊరి సమస్యలన్నిటినీ పరిష్కరించేసి అక్కడే ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడటమే ఈ సినిమా కధ. తెలుగు ప్రేక్షకులు కొన్ని వందల సినిమాలలో చూసిన ఈ పాత కధని దర్శకుడు రామ్ భీమన ప్రేక్షకులు మెప్పించేలా తీయడంలో విఫలమయ్యారు. అందువల్లే సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, మురళీశర్మ, రమ్యకృష్ణ వంటి హేమాహేమీలు పలువురు నటించినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 

ఇక బడ్డీ కధ విషయానికి వస్తే కోమాలో ఉన్న హీరోయిన్‌ ఆత్మ ఏ టెడ్డీ బేర్ బొమ్మలో ప్రవేశించడం కొత్త ప్రయోగం. దాని సాయంతో హీరో అవయవాల అక్రమ రవాణా ముఠాలతో ఏవిదంగా పోరాడనేది కధ. అయితే కధలో రొమాన్స్, యాక్షన్, కామెడీ మిక్స్ బాగుండటంతో బడ్డీ అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 30 నుంచి ప్రసారం కాబోతోంది.