బిచ్చగాడు-2 ప్లానింగ్ లో విజయ్..!

ఈ సంవత్సరం తెలుగులో భారీ హిట్ అందుకున్న సినిమాల్లో కచ్చితంగా బిచ్చగాడు ఒకటి. డబ్బింగ్ సినిమాల్లో ఓ రికార్డ్ సృష్టించిన బిచ్చగాడు మూవీకి సీక్వల్ గా బిచ్చగాడు-2 తీసే ఆలోచనలో ఉన్నాడు ఆ సినిమా హీరో, నిర్మాత విజయ్ ఆంటోని. స్వతహగా సంగీత దర్శకుడైన విజయ్ ప్రత్యేకమైన కథలతో సినిమాలు తీస్తుంటాడు.   

అయితే ఇదవరకు తన సినిమాలెవరు పట్టించుకోలేదు కాని బిచ్చగాడు తర్వాత తన రేంజ్ మారింది. అంతేకాదు అదే క్రేజ్ లో తన ఇంతకుముందు సినిమాలు నకిలి, డాక్టర్ సలీం సినిమాలు చూసేస్తున్నారు. ఇక దేశంలో నల్లధనం మీద ప్రధాని వేసిన కొరడాకు బడా బాబులందరికి దిమ్మ తిరిగింది. ఈ టైంలో బిచ్చగాడు-2 అది కూడా బ్లాక్ మని మీద సినిమా చేస్తున్నాడట విజయ్ ఆంటోని. 

కరెక్ట్ గా కుదరాలే కాని ఇది కూడా మరో బిచ్చగాడు అవుతుందనడంలో సందేహం లేదు. సినిమా బడ్జెట్ కూడా 50 కోట్ల దాకా ఉంటుందని టాక్ ఇప్పటికే మూవీకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారట కూడా. మరి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బిచ్చగాడే ఓ రేంజ్లో ఆడితే భారీ అంచనాల నడుమ వచ్చే పార్ట్-2 ఎలా ఉంటుందో చూడాలి.