ప్రియదర్శి జాతకం చూస్తారా?

ప్రియదర్శి తాజా చిత్రం డార్లింగ్ నిరాశ పరిచినా వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసేందుకు సిద్దం అవుతున్నాడు. క్లాసిక్ దర్శకుడుగా పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా దాదాపు పూర్తి చేశాడు. నేడు ప్రియదర్శి పుట్టినరోజు పురస్కరించుకొని ఆ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌, సినిమా టైటిల్‌ రెండూ నేడు ప్రకటించారు. సినిమా పేరు ‘సారంగపాణి జాతకం’. 

సినిమా టైటిల్‌, పోస్టర్ చూస్తే హీరోకి జాతకాల పిచ్చి అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించిన్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి పాయింట్ తీసుకొని సినిమాతో హాస్యం పండించవచ్చు కానీ కధ ముందే అర్దమవుతోంది కనుక హిట్ కొట్టాలంటే మోహనకృష్ణ ఏదో మ్యాజిక్ చేయాల్సిందే. 

ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా కేరళ బ్యూటీ రూపా కొడువాయూర్ నటిస్తోంది. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్‌ రామస్వామి సాగర్ సంగీతం అందిస్తున్నారు.