రామ్ చరణ్‌-బుచ్చిబాబు కామెడీ చేస్తారట!

బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా గురించి రామ్ చరణ్‌ తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ సినిమాలో కామెడీ పుష్కలంగా ఉంటుందని రామ్ చరణ్‌ చెప్పారు.

తనకు రొమాంటిక్ సినిమాల కంటే యాక్షన్ సినిమాలంటే ఎక్కువ ఇష్టమని చెప్పారు. తనకు బాగా ఇష్టమైన నటుడు సూర్య అని, హీరోయిన్‌ సమంత అని చెప్పారు. మిగిలిన హీరోయిన్లు అందరూ చాలా బాగా చేస్తున్నారని అందంగా కూడా ఉంటారని రామ్ చరణ్‌ అన్నారు. 

ఈ సినిమాకి సంబందించి మరో ఆసక్తికరమైన వార్త కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు జూ.ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాలనుకుని దానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆ టైటిల్‌ని రామ్ చరణ్‌తో చేయబోయే ఈ సినిమాకి ఉపయోగించుకోబోతున్నట్లు తెలుస్తోంది.

శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ చేంజర్‌’ షూటింగ్‌ ఎంతకీ పూర్తికాకపోవడం వలన రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమాకి అవరోధంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్‌-బుచ్చిబాబుల సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

బహుశః దసరా తర్వాత ఎప్పుడైనా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించబోతున్న సంగతి తెలిసిందే.