వాళ్ళమద్య ఏ గొడవా లేదు... ఇదిగో సాక్ష్యం!

పుష్ప-2 సినిమా షూటింగ్‌ మద్యలో అల్లు అర్జున్‌ సతీసమేతంగా విదేశీయాత్రకు వెళ్ళడంతో దర్శకుడు సుకుమార్‌తో అభిప్రాయ బేధాలు వచ్చాయని పుకార్లు మొదలైపోయాయి. అయితే అవన్నీ ఒట్టి పుకార్లే అని నిరూపిస్తూ, వారిద్దరూ కలిసి బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘మారుతీ నగర్‌ సుబ్రమణ్యం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. 

ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత అల్లు అర్జున్‌ వేదికపైకి వెళ్ళి అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నా మనసుకి నచ్చితేనే నేను ఎక్కడికైనా వెళ్తాను. కానీ ఈ సినిమా గురించి చెప్పి ఈ ప్రీ-రిలీజ్ వేడుకకి నన్ను రమ్మనమని స్కుమార్ కోరడంతో నేను మరో మాట మాట్లాడకుండా వచ్చేశాను,” అని అన్నారు. 

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, “అల్లు అర్జున్‌, సుకుమార్ మంచి స్నేహితులని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ వారిద్దరూ గొడవ పడ్డారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తాలని చూసి అందరం నవ్వుకునేవారం. అయినా ఈ పుకార్లు కూడా పుష్ప-2 ప్రమోషన్ చేస్తున్నప్పుడు మేమేందుకు కాదానాలి? అని అన్నారు నవ్వుతూ. నిజమే కదా?