ది లయన్ కింగ్ సినిమాకు మహేష్‌ బాబు డబ్బింగ్

ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ నిర్మిస్తున్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా తెలుగు వెర్ష న్‌కు మహేష్‌ బాబు డబ్బింగ్ చెప్పబోతున్నారు. ఆ సినిమాలో అడవికి రారాజుగా ఉండే ముఫసా (సింహం) పాత్రకు మహేష్‌ బాబు తెలుగులో డబ్బింగ్ చెప్పబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నెల 26న తెలుగు వెర్షన్ ట్రైలర్‌ విడుదల కాబోతోంది.

ముఫసా పాత్రకు డబ్బింగ్ చెప్పడంపై మహేష్‌ బాబు స్పందిస్తూ, డిస్నీ సంస్థ అంటే నాకు ఎంతో అభిమానం, చాలా గౌరవం. ఆ సంస్థ తీస్తున్న సినిమాలో ముఫసా పాత్రకి డబ్బింగ్ చెప్పేందుకు నన్ను ఎంపిక చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని నేను నా కుటుంబంతో కలిసి థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తాము,” అని అన్నారు. 

దీని హిందీ వెర్షన్‌లో ముఫసా పాత్రకి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూక్ ఖాన్, ముఫసా చిన్నప్పటి పాత్రకి ఆయన చిన్న కుమారుడు అబ్రమ్, సింబా పాత్రకు పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. తండ్రీ కొడుకులు ఈ సినిమాలో మూడు పాత్రలకు డబ్బింగ్ చెప్పడం విశేషమే కదా?