రాజావారు రాణీవారు సినిమాలో తొలిసారిగా హీరో, హీరోయిన్లున్‌గా నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వారి ప్రేమ రహస్యంగానే సాగుతోంది. ఈ ఏడాది మార్చి 13న వారి వివాహ నిశ్చితార్ధం జరిగిన తర్వాత వారి ప్రేమ గురించి అందరికీ తెలిసింది.
కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లాలో గురువారం వారి వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతోంది. మూడు రోజుల క్రితమే కిరణ్ బంధుమిత్ర సపరివారంగా అక్కడకు చేరుకొని పెళ్ళికి ముందు జరిగే వేడుకలలో పాల్గొంటున్నారు. దీంతో పెళ్ళి కూతురు ఇంట్లో చాలా హడావుడిగా ఉంది. ఆ వేడుకల ఫోటోలలో కొన్నిటిని రహస్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కిరణ్, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. ఇద్దరో ఒకే సినిమాతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి అందరినీ మెప్పించారు. కానీ ఆ సినిమా తర్వాత రహస్య సినిమాలు వదిలేసి ఉద్యోగంలో చేరిపోయింది. కిరణ్ అబ్బవరం తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వారిరువురి మద్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. చివరికి ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారు.