
తెలుగు యువ నటులలో ఎటువంటి హడావుడీ చేయకుండా నిశబ్ధంగా విలక్షణమైన కధాంశాలతో సినిమాలు చేస్తున్నవాడు సుహాస్. అందుకు తాజా నిదర్శనంగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చెప్పుకోవచ్చు.
దాని తర్వాత సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ‘జనక అయితే గనక’ అనే విచిత్రమైన టైటిల్‌తో మరో సినిమాని పూర్తి చేశాడు. ఎదుగూ బొదుగూ లేని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే సుహాస్ పెళ్ళి చేసుకున్నా పిల్లలు వద్దనుకుంటాడు. ఆ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తీసిన్నట్లు టీజర్ చెపుతోంది. టీజర్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది.
ఈ సినిమాలో సుహాస్‌కి జోడీగా సంగీర్తన నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, గోపరాజు రమణ, ఆచార్య శ్రీకాంత్ ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: విజయ్ బల్గేనిన్; కెమెరా: సాయి శ్రీరామ్; ఎడిటింగ్; కోడాటి పవన్ కళ్యాణ్ చేశారు.
ఈ సినిమాని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత రెడ్డి, హంసిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది.