
విక్టరీ వెంకటేష్, త్రిష కలిసి ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, ఓం నమో వెంకటేశాయా చేశారు. వాటిలో మొదటిది సూపర్ హిట్ కాగా రెండోది పోయింది. కానీ వారి జోడీకి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టిన్నప్పుడు త్రిషని తీసుకుందామనుకున్నారు. కానీ ఆమె వేరే సినిమాతో బిజీగా ఉండటంతో కుదరలేదు.
అది పూర్తి చేయక ముందే వెంకటేష్ దర్శకుడు నందుతో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ సినిమాలో హీరోయిన్గా చేసేందుకు త్రిష అంగీకరించిన్నట్లు తాజా సమాచారం. నందు సామాజవరగమన సినిమాతో తనకంటూ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇప్పుడు సీనియర్ నటీనటులైన త్రిష, వెంకటేష్‌లతో చక్కటి ఫ్యామిలీ స్టోరీతో సినిమా చేయబోతున్నాడు. వెంకటేష్, త్రిషలకు ఇటువంటి సినిమాలు అవలీలగా చేసి మెప్పించగలరు. కనుక దర్శకుడు నందు సరైన కధతో హిట్ కొట్టగలిగితే ఇక తిరుగు ఉండదు.
ఈ సినిమాని చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తారు. ఈ దసరా పండుగనాడు పూజా కార్యక్రమం చేసి వచ్చే వేసవి నాటికి సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో క్రైమ్ జోనర్లో ఓ సినిమా చేస్తున్నారు. దానిలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది.