
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో బ్రహ్మ ఆనందం అనే ఓ సినిమా సిద్దం అవుతోంది. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో స్వధర్మ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ రాజా తాత మనవళ్ళుగా నటిస్తున్నారు.
వెన్నెల కిషోర్, రఘుబాబు, సంపత్ రాజు, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్న రాఖీ పండుగ సందర్భంగా ఈ సినిమాలో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు.
త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు దానిలోనే వెల్లడించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఆర్‌వీఎస్ నిఖిల్, సంగీతం: శాండిల్య పీసపాటి, కెమెరా: మితేశ్ పర్వతనేని, ఎడిటింగ్: ప్రసన్న చేస్తున్నారు.