మ్యారేజ్‌స్‌ ఆర్ మేడ్ ఇన్‌ హెవెన్... లిరికల్ సాంగ్‌

దిలీప్ ప్రకాష్, రెజినా జంటగా నటిచిన ఉత్సవం సినిమా నుంచి ‘మ్యారేజ్‌స్‌ ఆర్ మేడ్ ఇన్‌ హెవెన్...’ అంటూ సాగే లిరికల్ మెలోడీ సాంగ్‌ విడుదలైంది. అనంత్ శ్రీరామ్ వ్రాసిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ చాలా అద్భుతంగా స్వరపరిచి మ్యూజిక్ అందించగా, అర్మాన్ మాలిక్ దానిని చాలా మధురంగా పాడారు. ఈ పాటలో దిలీప్ ప్రకాష్, రెజినాల మద్య కెమిస్ట్రీ బాగానే కుదిరాయి.  

అర్జున్ సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, అలీ, ఎల్బీ శ్రీరామ్,ప్రియదర్శి, ఆమని, సుధ, ప్రేమ ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు. హార్న్ బిల్ పిక్చర్స్ బ్యానర్‌పై సురేశ్ పాటిల్ ఈ సినిమాని నిర్మించారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/idCvuEfczwQ?si=9A2116ow1N0HfZz6" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>