1.jpeg)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే వంటి అగ్రతారాగణం నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా కల్కి ఎడి2898 కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారి ఎదురుచూపులు ముగియనున్నాయి.
ఈ నెల 22వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి ఎడి2898 ప్రసారం కాబోతోంది. ఈ విషయం నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించింది. అయితే హిందీ వెర్షన్ మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది.
కానీ అంత మాత్రాన్న తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందనవసరం లేదు. అదే రోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కల్కి ఎడి2898 ప్రసారం కాబోతోంది. కానీ అమెజాన్ ప్రైమ్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
సినిమాల మద్య ఏవిదంగా పోటీ నెలకొని ఉంటుందో ఓటీటీ సంస్థల మద్య కూడా అదేవిదంగా పోటీ నెలకొని ఉంది కనుక నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి ఎడి2898 విడుదలైతే, అమెజాన్ ప్రైమ్ కూడా వెంటనే విడుదల చేయకుండా ఉండదు. లేకుంటే ఈ పోటీలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది కదా?