విజయ్‌ గోట్ ట్రైలర్‌... చూసి తీరాలి!

కోలీవుడ్‌ స్టార్ హీరో దళపతి విజయ్‌ హీరోగా చేసిన ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ట్రైలర్‌లో చూపించేశారు. ఇండియన్ సీక్రెట్ ఏజెంట్‌గా విజయ్‌, అతనికి జోడీగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. విజయ్‌ స్నేహితుడుగా ప్రశాంత్, తండ్రి పాత్రలో విజయ్‌కి భార్యగా స్నేహ నటించారు. ప్రభుదేవ, యోగిబాబు, జయరాం, అజ్మల్ అమీర్, వాసుదేవన్,  ప్రేమ్‌జీ అమరన్, అఖిలన్, పార్వతీ నాయర్, లైలా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: యువన్ శంకర్ రాజా ; పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: సిద్దార్థ్ నుని; కొరియోగ్రఫీ: రాజు సుందరం, శేఖర్ విజే, సతీష్; యాక్షన్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: బి.శేఖర్, సూర్య రాజీవన్,  ఎడిటింగ్: వెంకట్ రాజేన్ చేస్తున్నారు. 

ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కలపతి ఎస్‌. అఘోరమ్ తదితరులు బారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.