
ప్రభాస్-హనూ రాఘవపూడి కాంబినేషన్‌లో ఈరోజు పూజా కార్యక్రమం జరుపుకున్న సినిమాకి సంబందించి మరిన్ని వివరాలు కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
“ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నవేళ, ఒక యోధుడు దేని కోసం యుద్ధం చేయాలో పునర్నిర్వచించాడు. 1940లలో జరిగిన సంఘర్షణే ఈ సినిమా. త్వరలో షూటింగ్ మొదలవబోతోంది,” అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. బ్రిటిష్ పాలనలో వారి అధీనంలో ఉన్న నేటి రాష్ట్రపతి భవన్‌పై ఫిరంగులతో దాడి చేస్తున్నట్లు చూపారు. ఆ మంటలలో బ్రిటిష్ జెండా, భవనం మంటలలో తగులబడుతున్నట్లు చూపారు.
ఈ సినిమాలో ప్రభాస్ స్వాతంత్ర సమరయోధుడుగా నటించబోతున్నట్లు చెప్పకనే చెప్పేశారు. ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌గా ఇమాన్వీ నటించబోతోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ముఖ్యపాత్రలు చేయబోతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేయబోతున్నారు.