ఆగస్ట్ 22న ఇంద్ర రీ-రిలీజ్

ఇప్పుడు పాత సూపర్ హిట్ సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్ హిట్ ‘మురారి’ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ విడుదల చేస్తే అభిమానులు సంతోషంగా చూశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ ‘ఇంద్ర’ సినిమాని ఆగస్ట్ 22వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. 

బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. అల్లు అర్జున్‌ రామలింగయ్య, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతీ ప్రసాద్, ఎంఎస్ నారాయణ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు. 

సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్ని సమపాళ్ళలో కుదరడం, ఊహించని విదంగా కధ మలుపులు తిప్పుతూ అద్భుతంగా తెరకెక్కించడంతో ఇంద్ర సినిమా సూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది.