
సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తీసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించడంతో కొరటాల ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. అయితే నిన్న మొన్నటిదాకా సినిమాకు 10 కోట్లు తీసుకున్న కొరటాల శివ చేస్తున్న మహేష్ సినిమాకు 13 కోట్లు అడుగుతున్నాడట.
అంతేనా ఓవర్సీస్ రైట్స్ లో 15 కోట్లకు మించి ఎంత వచ్చినా ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పాడట. డిమాండ్ మేరకే కొరటాల ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు మారు మాట మాట్లాడట్లేదు నిర్మాతలు. మహేష్ కొరటాల శివ సినిమా ముహుర్తం రీసెంట్ గా జరిగింది. ఫిబ్రవరి నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. తన మార్క్ సోషల్ మెసేజ్ తో మరోసారి తన పెన్ను పవర్ ఏంటో చూపించేందుకు రెడీ అయ్యాడు కొరటాల శివ.
సినిమా కథ మీద పూర్తి నమ్మకం ఉందంటూ శ్రీమంతుడుని మించి శక్తివంతమైన కథ ఇదని కొరటాల శివ ఎనౌన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం మురుగదాస్ సినిమా చేస్తున్న మహేష్ అది పూర్తి కాగానే కొరటాల శివ మూవీ షూటింగ్లో పాల్గొంటాడు.