జవాన్ రికార్డ్ అధిగమించిన కల్కి ఎడి2898

ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ కాంబినేషన్‌లో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి ఎడి2898 రూ.1,100 కోట్లకు పైగా కలక్షన్స్‌ రాబట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో అత్యధిక కలక్షన్స్‌ రాబట్టిన సినిమా నిలిచింది. 

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో బాహుబలి-2, కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్, షారూఖ్ ఖాన్ నటించిన హిందీ చిత్రం ‘జవాన్’ తర్వాత కల్కి ఎడి2898 నాలుగో స్థానంలో నిలిచింది. తాజా కలక్షన్స్‌ తర్వాత భారత్‌ ‘జవాన్’ రికార్డుని అధిగమించింది. భారత్‌లో జవాన్ సినిమా రూ.640.25 కోట్లు వసూలు చేయగా, కల్కి ఎడి2898 ఈరోజు ఉదయం కలక్షన్స్‌ కలుపుకుని రూ.640.30 కోట్లు కలక్షన్స్‌ సాధించి జవాన్ రికార్డుని అధిగమించింది.

కల్కి ఎడి2898 సినిమాని ప్రజలు ఇంతగా ఆదరించినందుకు కృతజ్ఞతగా ఆగస్ట్ 2 నుంచి 9వరకు వంద రూపాయలకే టికెట్‌ ఆఫర్ కూడా ఇస్తున్నారు.