ఐటి షాక్ లో బాహుబలి నిర్మాతలు..!

ఓ పక్క ప్రధాన మంత్రి 1000, 500 నోట్లు రద్దు చేసి సడెన్ గా షాక్ ఇస్తే మరో పక్క ఐటి ధికారులు కూడా తమ పని తాము చేసుకుపోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన బాహుబలి సినిమా మొదటి భాగమే దాదాపు 600 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు రాబోతున్న పార్ట్-2 కూడా ఓ రేంజ్లో బిజినెస్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ల ఇళ్ల మీద ఆర్కా మీడియా ఆఫీస్ ల మీద ఐటి అధికారులు రైట్స్ జరిపారట.

బాహుబలి-2 ను భారీ మొత్తంగా అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో ఈ రైట్స్ జరిగాయని తెలుస్తుంది. ఇప్పటికే నైజాం రైట్స్ కోసం 50 కోట్లు ఇస్తున్నట్టు తెలియగా సీడెడ్, ఆంధ్ర ఇంతకుమించి బిజినెస్ అవుతుంది. అయితే ఈ డబ్బు మొత్తం ఎలా ఇస్తారు అన్న విషయంపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక సినిమా బిజినెస్ కు సంబందించిన విలువైన డాక్య్మెంట్స్ కూడా వారికి దొరికినట్టు సమాచారం.

మొత్తానికి దేశంలో నల్లధన నిర్మూలనకు నోట్ల రద్దు కార్యక్రమాలే కాదు ఐటి అధికారులు కూడా మూలుగుతున్న నోట్ల కట్లలను బ్యాన్ చేసేలా రైడ్స్ జరుపుతున్నారు.