
విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. #VD12 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండ ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదలైంది. దీనిలో విజయ్ దేవరకొండని పూర్తి భిన్నమైన లుక్‌లో చూపారు.
“అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు.. రక్తపాతం.. ప్రశ్నలు.. పునర్జన్మ..” అంటూ ఈ సినిమా గురించి దర్శకుడు చిన్న హింట్ కూడా ఇచ్చారు. పునర్జన్మ కధతో ఈ సినిమా తీయబోతున్నట్లు సూచించారు. ఇది చాలా పాత కాన్సెప్ట్ అయినప్పటికీ చాలా ఏళ్ళుగా ఈ కాన్సెప్ట్ తో సినిమాలు రాలేదు కనుక ఇది హిట్ అయితే మళ్ళీ ఆ జోనర్‌లో సినిమాలు మొదలవవచ్చు. ఈ సినిమాని 2025, మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్‌లోనే ప్రకటించేశారు.
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.